Reddy's Cultural Association RCA History & Message

History of RCA

వెయ్యేళ్ళకు పైగా చరిత్ర గల నగరం రాజమహేంద్రవరం. రెండు రాజ్యాలు ఈ నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించాయి. మొదటిది రాజ రాజ నరేంద్రుడు పరిపాలించిన తూర్పుచాళుక్య వంశం కాగా రెండవది రెడ్డి రాజ్యము.1369 లో అనపోత రెడ్డి రాజమహేంద్రవరం పాలకునిగా నియమితుడైనప్పటి నించి కాటయ వేమారెడ్డి, రెండవకుమారగిరిరెడ్డి,వీరభద్రరెడ్డి తదితరులు పరిపాలించారు. రాజమండ్రి నుంచి కటక్ వరకు సుమారు అరవై ఏళ్ల పాటు రెడ్డి రాజుల పరిపాలన సాగింది. కొండవీడు రెడ్డి రాజు ప్రోలయ వేమా రెడ్డి కాలంలో నెల్లూరు జిల్లా పాకనాడు ప్రాంతం నుంచి చాలా రెడ్డి కుటుంబాలు రాజమహేంద్రవరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థిరపడి ఉంటాయని ప్రముఖ చారిత్రిక పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖర శర్మ తన ' హిస్టరీ అఫ్ రెడ్డి కింగ్ డమ్స్ పుస్తకంలో రాశారు. దీన్ని బట్టి 550 సంవత్సరాలనుంచి ఇక్కడ రెడ్లు నివసిస్తున్నట్టు తెలుస్తోంది. రెడ్డి రాజుల కాలం తర్వాత ఈప్రాంతంలో ఉన్న రెడ్లకు సంబంధించిన విశేషాలేవీ ఎక్కడా రికార్డు కాలేదు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పట్టణాలు అభివృద్ధి చెందుతుండడంతో పరిసర ప్రాంతాల నుంచి వ్యాపార, ఉద్యోగ అవకాశాల కోసం అన్ని కులాల వారు పట్టణాల బాట పట్టారు. అందరిలాగే రెడ్లు కూడా రాజముండ్రిలో స్థిరపడడం మొదలు పెట్టారు. ఇక్కడ మన వారి సంఖ్య పెరుగుతూ ఒకరికొకరికి పరిచయాలు ఏర్పడడంతో పలువురు పెద్దలు తరచూ కలుసుకుంటూ ఉండేవారు. ఉభయగోదావరి జిల్లాలకు రాజముండ్రి కేంద్రంగా ఉండడంతో ఈ రెండు జిల్లాల రెడ్ల అభ్యున్నతికి పాటు పడేలా ఒక సంగతిని ఏర్పాటు చేయాలనీ తలపోశారు. ఈ ఆలోచన కార్యరూపం దాల్చేలా కృషి చేసేందుకు 1957 లో ద్వారంపూడి కామారెడ్డి గారు, మేడపాటి అమ్మిరెడ్డి గారు, ద్వారంపూడి లక్ష్మణరెడ్డి గారు, టి.ఎల్. ఎన్.రెడ్డి గారు, గొలుగూరి బాపిరాజు గారు, కొవ్వూరి నాగిరెడ్డి గారు, కర్రీ మారెడ్డి గారు, పడాల వెంకట రెడ్డి గారు, తదితరులు రెడ్డి సంఘం ఏర్పాటు చేశారు. దేవీచౌక్ వద్ద గల కామారెడ్డి గారి మేడలో వీరు తరచూ సమావేశమయ్యేవారు. సంఘాన్నిరిజిస్టర్ చేయించక పోయినప్పటికీ క్రమం తప్పకుండా కార్యకలాపాలు నిర్వహించేవారు. మల్లిడి కనకసుందర రెడ్డి గారు, ఏ.సి.వై.రెడ్డి గారు, ఎం.వి.కృష్ణా రెడ్డి గారు,టి. వి. విశ్వేశ్వర రెడ్డి గారు, మేడపాటి సీతారామరెడ్డి గారు, కర్రి చిన అప్పారెడ్డి గారు, కర్రి ఆదిరెడ్డి గారు సంఘం అధ్యక్షులుగా వ్యవహరించారు.

1996 లో ఏర్పడిన కార్యవర్గం అసోసియేషన్ కార్యక్రమాలకు కొంత ఊపునిచ్చింది.సత్తి చంద్రా రెడ్డి గారు అధ్యక్షులుగా, మల్లిడి రామకృష్ణారెడ్డి గారు ఉపాధ్యక్షులుగా, తాడి బాపిరెడ్డి గారు-కార్యదర్శిగా, కొవ్వూరి రామకృష్ణారెడ్డి గారు-సహాయ కార్యదర్శి, ద్వారంపూడి సీతారాం గారు- కోశాధికారిగా, కార్యవర్గ సభ్యులుగా కర్రి కృష్ణారెడ్డి గారు,పడాల చినవెంకట రెడ్డి గారు, తేతలి సత్యనారాయణ రెడ్డి గారు, కర్రి వెంకట మధుసూదనరెడ్డి గారు లతో కార్యవర్గం ఏర్పడింది. సంఘాన్ని 'ది రెడ్డీస్ కల్చరల్ అసోసియేషన్'గా రిజిస్టర్ చేయించారు. కర్రి చిన అప్పారెడ్డి గారు. మేడపాటి సీతారామ రెడ్డి గారు, నల్లమిల్లి వెంకట రెడ్డి గారు,డి.ఎస్.రెడ్డి గారు తదితరుల సహకారంతో రాజమండ్రి తిలక్ రోడ్ లో అతి విలువైన స్థలాన్ని సమకూర్చారు. కొంతమంది అందించించిన భారీ విరాళాల తోను, చాలామంది సభ్యత్వ రూపుంలో ఇచ్చిన విరాళాలతో ఈ స్థలం ఖరీదు చేయగలిగారు. ఆ నాటి మన పెద్దలు ఎంతో ముందుచూపుతో కొనుగోలు చేసిన ఈ స్థలంలో నిర్మితమయ్యే కళ్యాణమండపము భవిష్యత్త్తులో రెడ్ల అభ్యున్నతికి ఉపయోగ పడే అనేక కార్యక్రమాలకు వేదిక కాబోతుంది. స్థలానికి సంబంధించి కోర్టులో వివాదం ఉండడంతో రిజిస్ట్రేషన్ ఆలస్యం అయ్యింది. తాడి సాయిరామారెడ్డి గారు, తాడి బాపిరెడ్డి గారు, కర్రి కృష్ణ రెడ్డి గారు, నల్లమిల్లి వెంకట రెడ్డి గారు, ద్వారంపూడి సీతారాం గారు, సత్తి చంద్రా రెడ్డి గారు, ఆ సమస్యను పరిష్కరించారు. తదనందతరం సతి చంద్రారెడ్డి గారు అధ్యక్షులుగా, నల్లమిల్లి కోటి రెడ్డి గారు ఉపాధ్యక్షులుగా , ద్వారంపూడి సీతారాం గారు కార్యదర్శిగా, కొవ్వూరి వెంకట రామారెడ్డి గారు సంయుక్త కార్యదర్శిగా, కొవ్వూరి రామిరెడ్డి గారు కోశాధికారిగా కార్యవర్గం సాగింది.వీరి హయాంలో సుమారు పదేళ్ళపాటు ఏటా కార్తీక వన మహోత్సవం ఘనంగా జరిగింది. స్థల సేకరణ చిన్న విషయం కాదు.అనేక ఆటంకాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో ముందుకు సాగి రిజిస్టేషన్ చేయించిన మన పెద్దలను ఎంత శ్లాఘించినా తక్కువే . తదనంతరం నల్లమిల్లి కోటి రెడ్డి గారు, మేడపాటి సూర్యనారాయణ రెడ్డి గారు సంఘం అధ్యక్షులుగా వ్యవహరించారు. 2007 లో కళ్యాణ మండపం నిర్మాణానికి ప్రముఖ పారిశ్రామిక వేత్త నల్లమిల్లి వెంకట రెడ్డి గారు శంకుస్థాపన చేశారు . నగరంలో ఒక మైలురాయిగా నిలిచిపోయే విధంగా భారీ కళ్యాణ మండపం నిర్మాణం తలపెట్టారు. నల్లమిల్లి వెంకట రెడ్డి గారు భారీ విరాళం అందించారు.

2019 మార్చిలో డాక్టర్ కర్రి రామారెడ్డి గారు మరియు నల్లమిల్లి వెంకటరెడ్డి గారు గౌరవ అధ్యక్షులుగా, చింతా ఎన్.జి.ఎస్. ప్రసాద రెడ్డి గారు అధ్యక్షులుగా,కొవ్వూరి వెంకట రామారెడ్డి గారు ఉపాధ్యక్షులుగా, ద్వారంపూడి సీతారాం గారు కార్యదర్శిగా, కొవ్వూరి మురళి గారు సంయుక్త కార్యదర్శిగా, మేడపాటి శ్రీనివాస రెడ్డి గారు కోశాధికారిగా, కర్రి మార్కండేయ రెడ్డి గారు, తాడి సాయి రామారెడ్డి గారు, సతి రామి రెడ్డి గారు, తమలంపూడి సూర్యనారాయణరెడ్డి గారు సభ్యులుగా, నల్లమిల్లి జగన్మోహన్ రెడ్డి గారు కో-ఆర్డినేటర్ గా కొత్త కార్యవర్గం ఏర్పడింది. కల్యాణమండపం నిర్మాణం ఎట్టి పరిస్థితిలోనైనా పూర్తిచేయాలనే తలంపుతో ఈ కమిటీ ముందుకు వెళుతోంది. కొవ్వూరి వెంకటరామ రెడ్డి గారు, కొవ్వూరి రామిరెడ్డి గారు గత తరం వారితో పనిచేశారు. ప్రస్తుత తరంతో పనిచేస్తూ రెండు తరాల సంధాన కర్తలుగా ఉన్నారు. మూడు ఫ్లోర్ల నిర్మాణం పూర్తి చేశారు. ఫ్లోరింగ్ తదితర తుదిమెరుగుల పని జరుగుతోంది. రెడ్డి సోదరులు ప్రతి వారు తమ వంతు సహకారం అందిస్తే త్వరలోనే సర్వాంగ సుందరంగా కళ్యాణమండపం రూపుదిద్దుకుంటుంది. ఈ బృహత్ కార్యక్రమంలో పాలుపంచుకొని ప్రతిఒక్కరు రాజముండ్రి రెడ్ల చరిత్రలో చిరస్థాయిగా నిలచిపో<తారు.

సంకలనకర్త - మేడపాటిశ్రీనివాసరెడ్డి, జర్నలిస్టు.

Committee's Message

మన రెడ్డీస్ కల్చరల్ అసోసియేషన్ ప్రారంభించి 23 సంవత్సరాలు కావస్తుంది. మన సంఘ పెద్దలు పలువురు అసోసియేషన్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన విషయం అందరికీ విదితమే. మన పెద్దలు ప్రారంభించిన రెడ్డీస్ కల్చరల్ అసోసియేషన్ భవన నిర్మాణం పనులు పునఃప్రారంభమైన విషయం అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాం, 1996లో ప్రారంభించబడిన మన అసోసియేషన్ లక్ష్యం సభ్యుల మధ్య పరిచయం పరస్పర సహాకారం, సంఘీయుల అభివృద్ధిలో ఒకరికొకరు సహకరించుకోవడంతో పాటు సంఘ సభ్యులు కలుసుకోవడానికి సమావేశాలకు, కుటుంబ వేడుకలకు ఉపయోగపడే భవన నిర్మాణం కూడా అన్న విషయం గౌరవ సభ్యుల దృష్టికి తీసుకువస్తున్నాము.

మీరు కుటుంబ బాధ్యతలు, వృత్తి, వ్యాపార కార్యకలాపాలతో తీరిక లేకుండా ఉంటారని తెలుసు. అయితే మీలో ఉన్న మానవీయత, సంఘీయుల పట్ల మీకున్న అభిమానం రెడ్డీస్ కల్చరల్ భవన నిర్మాణానికి సహకరిస్తుందని విశ్వసిస్తున్నాం. మన సంఘ భవన నిర్మాణం పనులు అందరూ ఏదో ఒకరోజు మీకు వీలు కుదిరినప్పుడు పర్యవేక్షించాలని కోరుతున్నాం. అలాగే మీ అమూల్యమైన సలహాలు, సూచనలు, ఇంకా ఎలా చేస్తే బాగుంటుందనే అంశాలపై మీ అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నాం.

దయచేసి ఈ అభ్యర్థనను మన్నించి మీ సలహాలు, సూచనలు తప్పక అందించగలరు. అలాగే రెడ్డీస్ కల్చరల్ అసోసియేషన్ నిర్వహణలో మీ భాగస్వామ్యం మరింతగా మమేకం కావాలని, సంఘ పురోభివృద్ధిలో ప్రతి క్కరి పాత్ర, బాధ్యత ఉందని తెలియజేస్తున్నాం. మన సంఘ పెద్దల ఆశయాలు, సంఘం లక్ష్యాలను చేరుకునే క్రమంలో మేము చేస్తున్న ప్రయత్నం మన అందరికోసమని తెలియజేస్తూ...

మన హిస్టరీ లో అసోసియేషన్ నిర్మాణములో సహకరించిన పెద్దలు ఎవరినైనా మరచినట్లైతే. మరల ఈ సందేశంలో పొందుపరచగల లేదా సవరించగల అవకాశమున్నదని తెలియజేయుచున్నాము... దయచేసి సహకరించగలరు...

వినమ్ర నమస్కారములతో
CH. N.G.S. ప్రసాద్ రెడ్డి మరియు కార్యవర్గ సభ్యులు
K.V. రామారెడ్డి
D. సీతారామ్ రెడ్డి
T.S.N. రెడ్డి (సూరిబాబు)
T. సాయి రామా రెడ్డి
K. మార్కండేయరెడ్డి
S.V. రామిరెడ్డి
M. శ్రీనివాసరెడ్డి
K. రామిరెడ్డి
మెంటార్: ఎన్. జగన్మోహన్ రెడ్డి