Reddy's Cultural Association
pr_img

Committee's Message


మన రెడ్డీస్ కల్చరల్ అసోసియేషన్ ప్రారంభించి 23 సంవత్సరాలు కావస్తుంది. మన సంఘ పెద్దలు పలువురు అసోసియేషన్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన విషయం అందరికీ విదితమే. మన పెద్దలు ప్రారంభించిన రెడ్డీస్ కల్చరల్ అసోసియేషన్ భవన నిర్మాణం పనులు పునఃప్రారంభమైన విషయం అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాం, 1996లో ప్రారంభించబడిన మన అసోసియేషన్ లక్ష్యం సభ్యుల మధ్య పరిచయం పరస్పర సహాకారం, సంఘీయుల అభివృద్ధిలో ఒకరికొకరు సహకరించుకోవడంతో పాటు సంఘ సభ్యులు కలుసుకోవడానికి సమావేశాలకు, కుటుంబ వేడుకలకు ఉపయోగపడే భవన నిర్మాణం కూడా అన్న విషయం గౌరవ సభ్యుల దృష్టికి తీసుకువస్తున్నాము.

మీరు కుటుంబ బాధ్యతలు, వృత్తి, వ్యాపార కార్యకలాపాలతో తీరిక లేకుండా ఉంటారని తెలుసు. అయితే మీలో ఉన్న మానవీయత, సంఘీయుల పట్ల మీకున్న అభిమానం రెడ్డీస్ కల్చరల్ భవన నిర్మాణానికి సహకరిస్తుందని విశ్వసిస్తున్నాం. మన సంఘ భవన నిర్మాణం పనులు అందరూ ఏదో ఒకరోజు మీకు వీలు కుదిరినప్పుడు పర్యవేక్షించాలని కోరుతున్నాం. అలాగే మీ అమూల్యమైన సలహాలు, సూచనలు, ఇంకా ఎలా చేస్తే బాగుంటుందనే అంశాలపై మీ అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నాం.

దయచేసి ఈ అభ్యర్థనను మన్నించి మీ సలహాలు, సూచనలు తప్పక అందించగలరు. అలాగే రెడ్డీస్ కల్చరల్ అసోసియేషన్ నిర్వహణలో మీ భాగస్వామ్యం మరింతగా మమేకం కావాలని, సంఘ పురోభివృద్ధిలో ప్రతి క్కరి పాత్ర, బాధ్యత ఉందని తెలియజేస్తున్నాం. మన సంఘ పెద్దల ఆశయాలు, సంఘం లక్ష్యాలను చేరుకునే క్రమంలో మేము చేస్తున్న ప్రయత్నం మన అందరికోసమని తెలియజేస్తూ...

మన హిస్టరీ లో అసోసియేషన్ నిర్మాణములో సహకరించిన పెద్దలు ఎవరినైనా మరచినట్లైతే. మరల ఈ సందేశంలో పొందుపరచగల లేదా సవరించగల అవకాశమున్నదని తెలియజేయుచున్నాము... దయచేసి సహకరించగలరు...

-వినమ్ర నమస్కారములతో
భవదీయులు
CH. N.G.S. ప్రసాద్ రెడ్డి
మరియు కార్యవర్గ సభ్యులు
       K.V. రామారెడ్డి     D. సీతారామ్ రెడ్డి
T.S.N. రెడ్డి (సూరిబాబు)     T.సాయి రామా రెడ్డి
    K. మార్కండేయరెడ్డి     S.V. రామిరెడ్డ
M. శ్రీనివాసరెడ్డి     K రామిరెడ్డి
మెంటార్
ఎన్. జగన్మోహన్ రెడ్డి

Advertisements


No. of Views of Website : 8974



About Us

Reddy's Cultural Association was established in 1996 to provide support for Reddy community in various aspects and thereby support the Nation.